పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధూకు కేంద్రం అనుమతి

  • కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లనున్న సిద్ధూ
  • అనుమతులు మంజూరు చేసిన విదేశాంగశాఖ
  • అనుమతుల కోసం మూడు లేఖలు రాసిన సిద్ధూ
పాకిస్థాన్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేత, భారత మాజీ క్రికెటర్ సిద్ధూకు లైన్ క్లియర్ అయింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆయనకు భారత విదేశాంగశాఖ అనుమతులు జారీ చేసింది. పాక్ వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కు గతంలో సిద్ధూ రెండు లేఖలు రాశారు. అయినా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన మూడో లేఖ రాశారు. తన మూడో లేఖకు కూడా స్పందించకపోతే లక్షలాది మంది సిక్కు భక్తుల మాదిరే తాను పాకిస్థాన్ వెళతానని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయనకు విదేశాంగశాఖ అనుమతులు మంజూరు చేసింది.

Go Back to Shorts
Sidhu
Kartarpur Corridor
Congress

More Telugu News